వన్‌ప్లస్ నుంచి మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో ఉంది. ప్యాడ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను అందించనున్నారు. ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా ప్రజలు దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, వారు ఇందులో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారని కంపెనీ పేర్కొంది. ఇంకా ఈ ట్యాబ్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!
వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాటరీ వివరాలు..
వన్‌ప్లస్ ప్యాడ్ 9,510 mAh బ్యాటరీని కలిగి ఉంది. 67W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.
అంటే 60 నిమిషాల్లోనే ఒకటి నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చన్న మాట.
వన్‌ప్లస్ ప్యాడ్ ప్రాసెసర్, డిస్‌ప్లే..
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను OnePlus ప్యాడ్‌లో అందించారు.
ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో, 2800 x 2000 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 11.61-అంగుళాల స్క్రీన్ ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ ప్రత్యేకత..
వన్‌ప్లస్ ప్యాడ్ ఫైల్ షేరింగ్, మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ ప్యాడ్‌లోని ఆడియో సిస్టమ్ కోసం డాల్బీతో వన్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇందులో మీరు గొప్ప సౌండ్‌ను అందించే నాలుగు స్పీకర్లను పొందుతారు.
ధర..
వన్‌ప్లస్ ప్యాడ్ సింగిల్ హాలో గ్రీన్ కలర్‌లో లాంచ్ అయింది. అయితే ఈ ప్యాడ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే లీకైన సమాచారం ప్రకారం.. ఇది.. రూ.24,999కి అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలి..
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను ఇటీవలే మనదేశంలో భారీగా తగ్గించారు. దీని ధర ఏకంగా రూ.ఐదు వేలు మేరకు తగ్గింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 నుంచి రూ.61,999కు తగ్గింది.
ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.71,999కు తగ్గించారు. వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్‌ను క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది.
2023 ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.