డొనేషన్ లు అక్కర్లేదు .. హీరో లు – క్రికెటర్ లూ – నాయకులూ ఇది చేస్తే చాలు !

-

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా షట్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏప్రిల్ 14 వరకు షట్ డౌన్ అమలులో ఉండటంతో…దేశంలో ఉన్న అన్ని రంగాల్లో స్తంభించిపోయాయి. ఇటువంటి సమయంలో దేశంలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది.యాంకర్ ప్రదీప్ కోసం ఎదురు చూపులు ...ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా గాని అది వారి జీవితాలలో కొద్దిపాటి సమయం కావడంతో చాలా మంది ప్రముఖులు హీరోలు మరియు క్రికెటర్లు అదేవిధంగా నాయకులు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఇటువంటి తరుణంలో యాంకర్ ప్రదీప్ చాలా వినూత్నంగా కరోనా వైరస్ వల్ల కుటుంబ పోషణ నెట్టుకు రాలేని 60 కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని వాళ్లకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెలిపారు.

 

అంతేకాదు మనలో సాయం చేయగల స్థోమత ఉన్నవారు ముందుకొచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన విధంగా సాయం చేయాలనీ కోరాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చాలా మంది నెటిజన్లు…విరాళాలు అందిస్తున్న హీరోలు మరియు క్రికెటర్లు పొలిటిషన్ లు యాంకర్ ప్రదీప్ చేసింది చేస్తే చాలా బాగుంటుందని…డొనేషన్ లు ప్రభుత్వాలకు అక్కర్లేదని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news