వైరస్ బారిన పడకుండా ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు ప్రజల ను కట్టడి చేయడానికి నియమించిన పోలీసులు మాత్రం భయంకరంగా ప్రజలపై లాఠీలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే వైరస్ కంటే ముందే పోలీసులు కొట్టే లాఠీదెబ్బలు తో చాలామంది చనిపోయేడాట్టు ఉన్నారు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుని రోడ్డుమీద ఆపి భయంకరంగా పోలీసులు కొట్టడంతో వెంటనే…కొడుకు తన తండ్రి పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేయడం జరిగింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన తండ్రి తన కొడుకుని కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కొట్టడానికి మీదకు వెళ్లి కాలర్ పట్టుకొని ఇద్దరు ఒకరిని ఒకరు తోసుకున్నారు.
అంతేకాకుండా తన కొడుకుని కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఉద్దేశించి నీమీద ఎస్పీకి కంప్లైంట్ ఇస్తానని…డీఎస్పీ దాకా వెళ్తాను అని ఆ సమయంలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే టైం లో డ్యూటీ చేస్తున్న పోలీసులు ఎందుకు అంత అవసరం లేదు, ఎస్ఐ ఇక్కడికి వస్తున్నారు ఆగండి అని చెప్పగానే అక్కడ నుంచి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఇద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకోవడం తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.