టీమిండియా విక్టరీపై ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే..?

-

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో పాక్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విదితమే. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ పాకిస్థాన్‌పై డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 89 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ విజ‌యం ప‌ట్ల యావ‌త్ భార‌త క్రికెట్ అభిమానులే కాదు, అటు రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు, ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. భార‌త్ సాధించిన ఈ ఘ‌న విజయం ప‌ట్ల వారు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి పాకిస్థాన్‌పై భార‌త్ సాధించిన ఈ విజయంపై ఎవ‌రెవ‌రు ఏమ‌ని కామెంట్ చేశారో.. ఒక లుక్కేద్దామా.!

ప్ర‌ముఖ సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో అభినంద‌న్ టీం ఇండియా పేరిట ఓ సైక‌త శిల్పాన్ని నిర్మించి భార‌త క్రికెట్ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపాడు.

టీం ఇండియా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో చ‌క్క‌ని విజ‌యాన్ని సాధించింద‌ని మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ ట్వీట్ చేశాడు.

భార‌త క్రికెట్ జ‌ట్టు పాకిస్థాన్‌పై గెలిచినందుకు తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌కు శుభాకాంక్ష‌ల‌తోపాటు బెస్టాఫ్ ల‌క్ తెలిపారు.

పాక్‌పై ఇండియా గెలిచినందుకు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్ కంగ్రాచులేషన్స్ టీం భార‌త్ అని ట్వీట్ చేశాడు.

పాక్‌పై విజ‌యం సాధించి భార‌త జెండాను రెప రెప‌లాడించినందుకు ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌కు న‌టుడు వివేక్ ఒబెరాయ్ కంగ్రాట్స్ చెప్పాడు.

పాక్‌పై ఇండియా గ్రేట్ విక్ట‌రీ సాధించినందుకు సంతోషంగా ఉంద‌ని న‌టుడు అనిల్ క‌పూర్ ట్వీట్ చేశారు.

అస‌లు పాక్‌తో ఇండియా ఆడ‌వ‌ద్ద‌ని తాను అనుకున్నాన‌ని, కానీ ఇండియా గెలిచినందుకు సంతోషంగా ఉంద‌ని న‌టుడు సిద్ధార్థ్ అన్నాడు.

పాక్‌పై గెలిచినందుకు టీం ఇండియాకు ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ అభినంద‌న‌లు తెలిపారు.


పాక్‌పై భార‌త్ గెలిచినందుకు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.

టీమిండియా క్రికెట్ మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ వెల్ డన్ అంటూ కామెంట్ చేశాడు.

వీరితోపాటు ఇంకా అనేక మంది ప్ర‌ముఖులు టీమిండియా గెలుపుపై స్పందించారు. భార‌త ఆట‌గాళ్ల‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news