బెల్లీ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన జాన్వీ క‌పూర్‌.. వీడియో..!

-

జాన్వీ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విపరీతంగా వైర‌ల్ అవుతోంది. అందులో జాన్వీ త‌న శ‌రీర భాగాల‌ను ఊపుతూ ప్ర‌ముఖ సింగ‌ర్ ష‌కీరాను త‌ల‌పించే విధంగా డ్యాన్స్ చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

ఫిట్‌నెస్ విష‌యంలో శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్ ఎంత శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తుందో మ‌నంద‌రికీ తెలుసు. నిత్యం వ‌ర్క‌వుట్ల విష‌యంలో గానీ, జిమ్‌కు వెళ్ల‌డంలో కానీ జాన్వీ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే త‌న ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవ‌డం కోసం ప‌లు ప్ర‌త్యేక వ‌ర్క‌వుట్లు కూడా జాన్వీ చేస్తుంటుంది. ఇక త‌న తొలి చిత్రం ధ‌డ‌క్‌తో న‌టిగా కూడా జాన్వీ మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఎంత శ్రీ‌దేవి కుమార్తె అయినా జాన్వీ త‌న త‌ల్లి స్థాయికి ఎద‌గాలంలే ఇంకా బాగా శ్ర‌మించాలి. అందుక‌నే ఆమె ప‌లు ప్ర‌త్యేక నృత్యాల‌ను కూడా అభ్యసిస్తోంది.

కాగా జాన్వీ చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విపరీతంగా వైర‌ల్ అవుతోంది. అందులో జాన్వీ త‌న శ‌రీర భాగాల‌ను ఊపుతూ ప్ర‌ముఖ సింగ‌ర్ ష‌కీరాను త‌ల‌పించే విధంగా డ్యాన్స్ చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. జాన్వీ చేసిన ఈ డ్యాన్స్‌ను సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు, ఆమెకు మంచి కామెంట్ల‌ను కూడా ఇస్తున్నారు. డ్యాన్స్ దివానీ అనే చాలెంజ్ లో భాగంగా జాన్వీ ఈ బెల్లీ డ్యాన్స్ చేయ‌గా.. ఇప్పుడు నెటిజ‌న్లు ఆ డ్యాన్స్ వీడియోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

జాన్వీ తాను చేసిన ఆ డ్యాన్స్ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. చాలా మంది ఇప్ప‌టికే ఆ వీడియోను వీక్షించారు. కాగా ప్ర‌స్తుతం జాన్వీ దేశంలోనే తొలి లేడీ పైలెట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత క‌థ ఆధారంగా తీస్తున్న త‌క్త్ అనే సినిమాలో న‌టిస్తోంది. అలాగే మ‌రో హార్ర‌ర్ కామెడీ మూవీలోనూ జాన్వీ త్వ‌ర‌లో న‌టించ‌నుంది. ఏది ఏమైనా.. జాన్వీ బెల్లీ డ్యాన్స్ మాత్రం ఇప్పుడు అంద‌రినీ బాగా ఆక‌ట్టుకుంటోంది..!

Read more RELATED
Recommended to you

Latest news