అధికారి కారణంగా చంద్రబాబు దొరికిపోయారా…?

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి దొరికిపోయారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అవినీతి విషయంలో ఈ 9 నెలల కాలంలో కాస్త ప్రశాంతంగానే ఉంది. ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలని చూసినా సరే పెద్దగా తెలుగుదేశం పార్టీ దొరకలేదు. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీ పక్కా ఆధారాలతో జగన్ సర్కార్ కి దొరికింది అని అంటున్నారు.

తాజాగా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని కేంద్రం తప్పుబట్టలేదు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ… చార్జ్ షీట్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.

అసలు ఎం జరుగుతుందో టీడీపీ నేతలకు అర్ధం కావడం లేదు. గత నెలలో జరిగిన ఈ పరిణామం తో పాటుగా ఐటి దాడుల విషయంలో కూడా టీడీపీ ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు పాపం టీడీపీ నేతలకు. అయితే ఇక్కడ రాజకీయ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. చంద్రబాబు కేంద్రానికి దొరికిపోయారని అంటున్నారు. ఆయన అవినీతిని అధికారుల నుంచి నరుక్కుంటూ వస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం కేంద్రం చంద్రబాబు విషయంలో చాలా జాగ్రత్తగా… వ్యవహరిస్తుంది అంటున్నారు. ఎక్కడా కూడా ఎవరికి లీక్ ఇవ్వకుండా వరుస షాక్ లు ఇవ్వాలని టీడీపీ ఆర్ధిక మూలాలను గురి పెట్టాలని కేంద్రం భావిస్తుంది. మరి ఈ వ్యవహారంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎం ఎం బయటపెడుతుంది, కేంద్రానికి ఏయే ఆధారాలు ఇస్తుంది అనేది ఇప్పుడు చూడాలి. త్వరలో కొందరిని అరెస్ట్ చేయడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news