e-Shram portal: వలస కార్మికుల‌ కోసం కేంద్రం 12 అంకెల UAN అందిస్తుంది..

-

దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులు కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో బాగా నష్టపోయారు. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎంత మంది వలస కార్మికులు ఉన్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికులను గుర్తించేందుకుగాను కేంద్రం చర్యలు షురూ చేసింది. ఈ క్రమంలోనే ఈ శ్రామ్ పోర్టల్ e-Shram portal లాంచ్ చేసింది.

ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనుంది. ప్రతీ ఒక్కరికి ఆధార్ నెంబర్ మాదరిగా 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనుంది. ఈ పన్నెండు సంఖ్యల యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) ద్వారా వారికి ఒక ఐడెంటిఫికేషన్ రానుంది. ఇకపోతే ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.

దేశాన్ని నిజంగా నిర్మించే శ్రామికులు అసంఘటిత రంగానికి చెందిన వారేనని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నేషన్ బిల్డర్స్ అయిన అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయబోతున్నారు. ట్రేడ్ యూనియన్స్‌కు చెందిన ముఖ్య నేతలతో సమావేశం అనంతరం ఈ శ్రామ్ పోర్టల్‌ను లాంచ్ చేసినట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అసంఘటిత రంగ కార్మికులకు మేలు జరుగుతున్నదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు. ఈ పోర్టల్ ఆధారంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కృషి చేసేందుకుగాను కేంద్రప్రభుత్వం కృషి చేయనుందని కేంద్రం మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news