జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రకటన..తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపిక

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దేశవ్యాప్తంగా 44 మంది ఎంపిక అయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు.

విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్ ఎంపిక కాగా చిత్తూరు ఎం.పాయిపల్లి ఐరాల హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మునిరెడ్డి ఎంపిక అయ్యారు. అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక కాగా అందులో ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్‌ ప్రధానోపాధ్యాయుడు రంగయ్య ఎంపిక అయ్యారు. అలాగే సిద్ధిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్ఎం రామస్వామి ఎంపిక అయ్యారు. తెలంగాణ కు రెండు అవార్డు లు రావడం పై ఉపాధ్యాయ సంఘాలు హర్ష వ్యక్తం చేస్తున్నాయి.