సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుంది – బాల్క సుమన్

-

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం కేసీఆర్ లేఖ రాసినప్పటికీ సింగరేణికి గనులను కేటాయించడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు సింగరేణికి ఒక్క గని కూడా కేటాయించలేదని, సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. సింగరేణి పరిసరాలలో గనులను వేలానికి పెడుతున్నారని.. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ మిత్రుడు అదానికి అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు బాల్క సుమన్. ఇవేమీ తెలియకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లాభాలలో ఉన్న సింగరేణిని నష్టాలపాలు చేయవద్దని అన్నారు. బొగ్గు గనుల వేలానికి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని.. ప్రైవేటీకరణ పై రేపు ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము బిజెపి ఎంపీలకు ఉందా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు మాదిరిగానే సింగరేణి విషయంలో కేంద్రం వ్యవహరిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news