కమలదళంలో కిరణ్‌కుమార్..తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ అవుతుందా!

-

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. ఇక బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని, ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, సీఎంగా కిరణ్‌ సేవలందించారని, కాంగ్రెస్‌లో ఆయన ఇన్నింగ్స్ ముగిసిందని.. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉందన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదని, తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందని,  విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని అన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యమని, మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ తెలిపారు.

 Kiran Reddy Joins BJP

అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ మొదట నుంచి కాంగ్రెస్ లో ఉంది. 1952 నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తుంది. 1989లో కిరణ్ కాంగ్రెస్ లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి స్పీకర్ గా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీ సి‌ఎంగా చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ని వదిలి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి విఫలమై..మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు బి‌జే‌పిలోకి వచ్చారు.

అయితే కిరణ్ వల్ల తెలంగాణలో బి‌జే‌పికి పావలా ఉపయోగం ఉండదు. ఎందుకంటే విభజన సమయంలో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ముందుకెళ్లారు. ఇటు ఏపీలో కూడా పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఇమేజ్ పెద్దగా లేదు. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కిరణ్ వల్ల బి‌జే‌పికి యూజ్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news