సింగరేణికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది.కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన ప్రాధ్యనతనే సింగరేణికి కేంద్రం ఇస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణి కేంద్రం ఆదుకొనే విధంగా ప్రణాళికలు చేస్తామని హామీ ఇచ్చారు.రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయని.. ఒడిస్సా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే పాలసీ కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు.
సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. అయితే వాటిని అధిగమిస్తామని ఆయన వివరించారు. సింగరేణి విషయంలో పార్టీలు రాజకీయం చేయొద్దని కోరారు. రెండు మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆక్షన్ అనేది ఓపెన్…సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.