కృష్ణా, గోదావ‌రి న‌దుల పున‌ర్జీవానికి కేంద్రం భారీ నిధులు

-

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌వ‌హిస్తున్న కృష్ణా, గోదావ‌రి నిధుల‌ను అభివృద్ధి చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. అందు కోసం కేంద్ర ప్ర‌భుత్వం భారీగా నిధుల‌ను కేటాయించింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన‌మైన 13 న‌దుల‌ను పురుజ్జీవింప చేయాడానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసింది. అందు కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా రూ. 19,342 కోట్ల‌ను ఖ‌ర్చు చేయాల‌ని భావించింది.

కాగ ఈ న‌దుల లీస్టులో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌వ‌హిస్తున్న కృష్ణా, గోదావ‌రి న‌దులు కూడా.. ఉన్నాయి. గోదావ‌రి న‌ది కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ. 1,700.84 కోట్లు, కృష్ణా న‌ది కోసం రూ. 2,327.47 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌, అట‌వీ శాఖ నిర్ణ‌యాల‌ను తీసుకుంది.

అలాగే దీనికి సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర మంత్రులు గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్, భూపేంద‌ర్ యాదవు సోమ‌వారం విడుద‌ల చేశారు. కాగ ఈ నిధులతో ఈ 13 ప్ర‌ధాన న‌దుల ప‌రీవాహ‌క ప్రాంతం చుట్టు మొక్క‌లు పెంచ‌నున్నారు. అలాగే న‌దుల కోత‌ను అరిక‌ట్టాలి. అలాగే భూగ‌ర్భ జ‌ల‌వ‌న‌రులు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకునేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news