ఆంధ్రప్రదేశ్ అప్పులపై పార్లమెంట్ మరోసారి లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వేసిన ప్రశ్నకు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు. 2019 తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలు అయ్యాయని.. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతుందన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 4,42,442 కోట్లు అని తెలిపారు.
2019లో అప్పు రూ. 2,64,451 కోట్లు ఉండగా.. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం 4,42,442 కోట్లకు చేరిందని తెలిపారు. ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ అప్పు 45 వేల కోట్లు పెరుగుతుందని చెప్పారు. బడ్జెట్ అప్పులకు తోడు కార్పొరేషన్లు, సహా ఇతర మార్గాలలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులు అదనమని కేంద్ర మంత్రి వెల్లడించారు.