ఏపీలో రంగంలోకి దిగిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరగడం పై కేంద్ర ప్రభుత్వం కాస్త అసహనంగా ఉన్నట్టు సమాచార౦. కేసులను ఏ స్థాయిలో కట్టడి చేస్తున్నా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కట్టడి అయ్యే అవకాశాలు కనపడకపోవడం ప్రతీ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఇప్పుడు కేంద్రమే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.

లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతలు వ్యవహార శైలిపై కేంద్రం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ప్రతీ రోజు కూడా వైసీపీ నేతలు ఏదోక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి లో చేసిన ర్యాలీ వివాదాస్పదంగా మారింది. ఆ ర్యాలీ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. 40 కి చేరుకున్నాయి కేసులు. అక్కడ వైరస్ సోకినా వారిలో…

18 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దీనిపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో కేంద్ర బలగాలను దింపాలి అని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదంటూ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకు సీఎం జగన్ కాని ప్రస్తుతం పరిస్థితులు ఆ విధంగా లేదు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో మినహా అన్ని చోట్లా కూడా కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news