సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్​ మిల్లర్​పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

-

సౌతాఫ్రికా ఆల్​రౌండర్ డేవిడ్ మిల్లర్​పై టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. విరాట్​ను పాక్ కెప్టెన్ బాబర్​తో పోల్చడమే దీనికి కారణం. అసలేం జరిగిందంటే..?

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న డేవిడ్ మిల్ల‌ర్​కు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కష్టమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే..? క‌వ‌ర్ డ్రైవ్ ఆడే విష‌యంలో కోహ్లీ, బాబ‌ర్​లో ఎవ‌రు బెస్ట్ అంటూ అని హోస్టు అడిగారు. దానికి బాబ‌ర్ అంటూ స‌మాధానం చెప్పాడు మిల్లర్. మిల్ల‌ర్‌ స‌మాధానంతో బాబ‌ర్ ఫ్యాన్స్ ఖుషీ అయినా కోహ్లీ అభిమానులు మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నారు. మిల్లర్​ను మామూలుగా ట్రోల్ చేయడం లేదు.

ప్ర‌స్తుతం పాకిస్థాన్ లీగ్‌లో ఆడుతున్న మిల్ల‌ర్ అక్క‌డి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయ‌డానికి కావాల‌నే కోహ్లీని త‌క్కువ చేశాడంటూ చెబుతున్నారు. కోహ్లీకి బాబ‌ర్ ఎప్ప‌టికీ పోటీ కాద‌ని ఫ్యాన్స్​ అంటున్నారు. ఇదే ఇంట‌ర్వ్యూలో యార్క‌ర్స్ విష‌యంలో అఫ్రిది, బుమ్రాలో ఎవ‌రు బెస్ట్ అని అడిగిన ప్ర‌శ్న‌కు బుమ్రా అంటూ స‌మాధానం చెప్పాడు మిల్ల‌ర్‌.

Read more RELATED
Recommended to you

Latest news