క‌రోనా పేషెంట్ల డిశ్చార్జికి కేంద్రం కొత్త రూల్స్‌..!

-

క‌రోనా పేషెంట్ల‌కు టెస్టులు చేసే ద‌గ్గ‌ర్నుంచీ.. వారిని డిశ్చార్జి చేసే వ‌రకు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్ర‌త్యేక రూల్స్‌ను పాటిస్తూ వ‌చ్చారు. అయితే ఇక ఆ రూల్స్ మారాయి. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విష‌యంపై క‌స‌ర‌త్తు చేసి కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాలు ఈ రూల్స్ ప్ర‌కార‌మే ఇక‌పై క‌రోనా పేషెంట్ల‌ను టెస్టు చేయాల్సి ఉంటుంది. అలాగే వారిని డిశ్చార్జి చేసేందుకు కూడా ఇవే రూల్స్‌ను పాటించాలి. ఈ క్ర‌మంలో మొత్తం 3 విభాగాల్లో కేంద్రం ప‌లు నియ‌మాల‌ను రూపొందించింది. అవేమిటంటే…

center released new discharge policy for covid 19 patients

1. మైల్డ్/ వెరీ మైల్డ్/ ప్రీ సింప్ట‌మాటిక్ కేసులు

త‌క్కువ లేదా చాలా త‌క్కువ లేదా ముంద‌స్తు ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి కోవిడ్ 19 కేర్ ఫెసిలిటీలో రెగ్యుల‌ర్‌గా టెంప‌రేచ‌ర్‌, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ టెస్టులు చేస్తారు. ఇలాంటి వారికి 3 రోజుల పాటు ఎలాంటి జ్వ‌రం లేక‌పోతే వీరిని 10 రోజుల త‌రువాత డిశ్చార్జి చేస్తారు. ఇక డిశ్చార్జి చేసే ముందు టెస్టులు చేయాల్సి అవ‌స‌రం లేదు. డిశ్చార్జి అయ్యాక మాత్రం 7 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేష‌న్‌లో ఉండాలి. ఇక కోవిడ్ 19 కేర్ సెంట‌ర్‌లో ప‌రిశీల‌న‌లో ఉన్న‌వారి ఆక్సిజ‌న్ శాచురేష‌న్ స్థాయిలు 95 శాతం క‌న్నా త‌క్కువ‌కు ప‌డిపోతే వారిని డెడికేటెడ్ కోవిడ్ 19 హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తారు. ఫెసిలిటీ నుంచి డిశ్చార్జి అయ్యాక జ్వ‌రం, ద‌గ్గు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తే.. వారు కోవిడ్ 19 కేర్ సెంట‌ర్‌ను సంప్ర‌దించాలి. లేదా 1075 హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు కాల్ చేయ‌వ‌చ్చు. ఇక వారి ఆరోగ్య స్థితిని టెలికాన్ఫ‌రెన్స్ ద్వారా 14 రోజుల వ‌ర‌కు నిత్యం ప‌రిశీలిస్తారు.

2. కోవిడ్ 19 హెల్త్ సెంట‌ర్ (ఆక్సిజ‌న్ బెడ్స్)లో అడ్మిట్ అయిన మోడ‌రేట్ కేసులు

వీరికి 3 రోజుల పాటు టెంప‌రేచ‌ర్‌, 4 రోజుల పాటు ఆక్సిజ‌న్ శాచురేష‌న్ టెస్టులు చేస్తారు. అప్ప‌టి వ‌ర‌కు ప‌రిశీల‌న‌లో ఉంచుతారు. 3 రోజుల్లో జ్వ‌రం తగ్గినా, ఆక్సిజ‌న్ శాచురేష‌న్ స్థాయిలు 95 శాతం క‌న్నా ఎక్కువ‌కు చేరుకున్నా.. వీరిని మ‌రో 10 రోజుల పాటు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి ఆ త‌రువాత డిశ్చార్జి చేస్తారు. వీరిని డిశ్చార్జి చేసిన‌ప్పుడు కూడా ఎలాంటి టెస్టులు చేయ‌రు. అయితే డిశ్చార్జి అయ్యాక మాత్రం 7 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేష‌న్‌లో ఉండాలి. అప్ప‌టి వ‌రకు వారిని నిత్యం ఫోన్ కాల్స్ ద్వారా ప‌రిశీలిస్తారు. ఇక 3 రోజుల్లో జ్వ‌రం త‌గ్గ‌క‌పోయినా, ఆక్సిజ‌న్ శాచురేష‌న్ స్థాయిలు 95 శాతం క‌న్నా త‌క్కువగానే ఉన్నా.. వారికి చికిత్స ఇస్తారు. జ్వ‌రం త‌గ్గేలా చేస్తారు. ఆక్సిజ‌న్ థెర‌పీ కంటిన్యూ అవుతుంది. ఆ త‌రువాత మ‌రో 3 రోజుల పాటు వారిని ప‌రిశీల‌న‌లో ఉంచి.. అనంత‌రం డిశ్చార్జి చేస్తారు.

3. తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న కేసులు

ఈ పేషెంట్ల‌కు నిత్యం చికిత్స అందిస్తూ.. ల‌క్ష‌ణాలు త‌గ్గేలా చూస్తారు. త‌రువాత టెస్టుల్లో నెగెటివ్ రావాల్సి ఉంటుంది. అప్పుడే డిశ్చార్జి చేస్తారు.

ఇక క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారికి 14 రోజుల పాటు చికిత్స అందించిన అనంత‌రం 14వ రోజున టెస్టు చేస్తారు. ఆ త‌రువాత ప్ర‌తి 24 గంట‌ల‌కు ఒక‌సారి టెస్టు నెగెటివ్ వ‌చ్చే వ‌ర‌కు టెస్ట్ చేస్తారు. ఈ క్ర‌మంలో 48 గంట‌ల్లో 2 సార్లు నెగెటివ్ వ‌స్తే ఆ పేషెంట్‌ను డిశ్చార్జి చేస్తారు. ఇక ఈ నియ‌మాల‌కు సంబంధించి స‌ద‌రు మంత్రిత్వ శాఖ ఓ డాక్యుమెంట్‌నే విడుద‌ల చేసింది. వాటిని తెలుసుకోవాలంటే.. https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf అనే సైట్‌ను సంద‌ర్శించి స‌ద‌రు పీడీఎఫ్ డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news