బ్రేకింగ్ : కరోనా ఉన్న వోటు వేయచ్చు.. ఎప్పుడంటే ?

-

నెలలు గడుస్తున్నా కోవిడ్ నుంచి ఉపశమనం లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ప్రజారోగ్యంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను కూడా కాపాడుకోవాలని ఆయన అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి జనజీవనంలో సాధారణం అయిపోయిందని ఆయన అన్నారు. ఎన్నికలను సరి కొత్త ఆరోగ్య భద్రత ప్రమాణాల మధ్య నిర్వహిస్తామని అన్నారు. నవంబర్ 29తో బిహార్ అసెంబ్లీ ముగియనున్నదని ఆయన అన్నారు.

కోవిడ్ జాగ్రత్తల్లో భాగంగా 7 లక్షల హ్యాండ్ శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డులు, 23 లక్షల హ్యాండ్ గ్లౌజులు సమీకరించామన్న ఆయన ఓటర్లు ఒకసారి ఉపయోగించి పడేసేందుకు 7.2 కోట్ల చేతి గ్లౌజులు ఏర్పాటు చేశామని అన్నారు. ఆన్‌లైన్ పద్ధతుల్లోనే నామినేషన్లు ఉంటాయన్న ఆయన కోవిడ్ అనుమానిత ఓటర్లు చివర్లో ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. చేసామని అన్నారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసామని అన్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించామని, కరోనాతో హోం క్వారంటైన్ లో ఉన్నవారికి చివరి రోజు ఓటేసే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news