షాకింగ్: సి ఫుడ్ ప్యాకెట్లపై కరోనా…!

-

చైనా యొక్క తూర్పు నగరమైన కింగ్‌ డావోలోని ఆరోగ్య అధికారులు సీఫుడ్ దిగుమతిదారులు నిల్వ చేసిన కొన్ని ప్యాకేజీలపై కరోనా వైరస్ ఆనవాళ్ళు కనుగొన్నారు. నిల్వ చేసిన ఆహార దిగుమతులపై చైనా తనిఖీలను వేగవంతం చేసింది. కరోనా నేపధ్యంలో విదేశాల నుంచి మాంసం దిగుమతి చేసుకోవడాన్ని చైనా నిషేధించింది. గురువారం ఈ ఫలితాలు వచ్చాయని అక్కడి అధికారులు చెప్పారు.

అయితే ఆ దిగుమతుల కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బంది ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు అని, 147 మందకి పరిక్షలు చేసామని కింగ్డావో మునిసిపల్ హెల్త్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దిగుమతిదారుల ఉత్పత్తులలో 51 ఉత్పత్తుల మీద నమూనాలు కనిపించాయని చెప్పింది. ఎవరు అయినా సరే నాలుగు వారాలు నిల్వలేకుండా వస్తువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news