ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదు- హరీష్ రావు

-

వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎఫ్ సీ ఐ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హరీష్ రావు కోరారు. సోమవారం సిద్ధిపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తూ కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తీరు వల్ల నష్టపోతున్నారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకుంటుందని వెల్లడించాడు. వర్షాకాలంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం ఎంత వచ్చినా కొనేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. ఈ వానాకాలం సీజన్ లో 3.3 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల విద్యుత్, రైతుబంధు పథకాల వల్ల తెలంగాణలో వ్యవసాయం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ క్రుషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news