పైరసీ వెబ్‌సైట్లు, ఓటీటీలపై కేంద్రం కొరడా!

-

పైరేటెడ్‌ కంటెంట్‌ను ప్రసారం చేసే వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించేందుకు రెడీ అవుతోంది. ఆ స్తంభింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. పైరసీని అదుపు చేసే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

ఇప్పటికే కంటెంట్‌ను ఫిల్మింగ్‌ చేయడాన్ని నేరంగా పరిగణించాలని కేంద్రం ప్రతిపాదించిందని, ఇపుడు అటువంటి పైరేటెడ్‌ కంటెంట్‌ను ప్రసారం చేసినా నేరంగా పరిగణించే మరో నిబంధనను జత చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత మార్పులను సినిమాటోగ్రాఫ్‌ చట్టంలో ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. సవరణ ముసాయిదాను ‘అతి త్వరలో’ పార్లమెంటులో ప్రవేశపెట్టి, చట్టం చేయగలమని వివరించారు.

ఓటీటీ  సంస్థలు కంటెంట్‌ను సృష్టించే విషయంలో మన దేశ సంప్రదాయాలకు భంగం కలగకుండా ‘అత్యంత జాగ్రత్త’ వహించాలని పరిశ్రమకు అపూర్వ చంద్ర సూచించారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.  ప్రస్తుతం ఓటీటీల స్వయం నియంత్రణలో మూడంచెల వ్యవస్థ ఉందని, ఇది బాగానే పని చేస్తోందని, కేవలం 3-4 ఫిర్యాదులే అందాయని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news