సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీరు గూగుల్.. ఫోన్ పే.. వంటివి వాడుతున్నారా..? అడ్డు అదుపు లేకుండా లావాదేవీలు చేస్తున్నారా..? యూపీఐ లావాదేవీలకు అలవాటు పడిపోయారా..? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. గూగుల్ పే, ఫోన్ పే.. దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ పేమెంట్ యాప్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు.అంటే ఈ రెండు యాప్స్ చాలా పాపులర్ అని చెప్పుకోవచ్చు. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది.
అదేంటంటే, వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన కేంద్రం. ఈ యాప్స్ ఉపయోగించే వారికి ఝలక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే, వాటిపై అదనపు చార్జీల భారాన్ని మోపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసిన సిఫార్సులను యధాతథంగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీన ఆరంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలులోకి రానుంది. ఎన్సీపీఐ జారీ చేసిన సర్కులర్ ప్రకారం యూపీఐ ద్వారా 2000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసిన వినియోగదారులపై 1.1 శాతం అదనపు చార్జీలను ఎన్సిపిఐ వసూలు చేయాలనే యోచనలో ఉంది. ఈ నిర్ణయంపై విపక్షాలూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.