కేంద్రం నుండి గుడ్ న్యూస్… లక్షల మందికి ప్రయోజనం.. వివరాలు ఇవే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ఎన్నో లాభాలు కలుగుతున్నాయి. చాలా మంది ఎక్కువగా చిన్న మొత్తాల పొదుపు పథకాలు లో డబ్బులు పెడుతూ వుంటారు. అయితే ఈ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్ల ని పెంచే ఛాన్స్ కనపడుతోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే… ఏప్రిల్ నుంచి జూన్ మధ్య త్రైమాసికానికి సంబంధించి కొత్త వడ్డీ రేట్లను కేంద్రం మార్చనుంది.

జనవరి-మార్చి క్వార్టర్‌కు సంబంధించి కేంద్రం గతం లో వడ్డీ ని మార్చింది. అయితే అన్ని స్కీమ్స్ కి మార్చలేదు. కొన్ని స్మాల్ సేవింగ్స్ పథకాలపై మాత్రమే వడ్డీ ని మార్చింది. కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి వడ్డీ మాత్రం అలానే వుంది. కనుక ఇప్పుడు వడ్డీ రేట్ల పెంపు తప్పనిసరిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి.

ప్రతి మూడు నెలలు కి ఒకసారి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు మారతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై కేంద్రం 7.1 శాతం వడ్డీ ని ఇస్తోంది. అయితే ఈ స్కీమ్ వడ్డీ ఆర్థిక శాఖ ఫార్ములా ప్రకారం ఈ మొత్తం 7.6 శాతానికి పెరగాలి. అదే సుకన్య సమృద్ధి యోజనకు అయితే ప్రస్తుతం 7.6శాతం వడ్డీ వస్తోంది. అది 8.1 శాతానికి చేరే ఛాన్స్ ఉందిట. మరి వడ్డీ పెరుగుతుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news