జగన్ ఎఫెక్ట్.. ఏపీకి 708 కోట్లు విడుదల చేసిన కేంద్రం

-

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. మరోసారి ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతానికి 708.65 కోట్లను విడుదల చేస్తూ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం కొలువుదీరి 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఉపాధి హామీకి సంబంధించి ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేసింది. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులకు రావాల్సిన బకాయిల్లో 708 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రావాల్సిన 2500 రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన యూసీలను గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అంతే కాదు.. గత ఐదేళ్లలో అన్ని రాష్ర్టాల కంటే ఎక్కువ నిధుల్ని ఏపీ ప్రభుత్వమే వినియోగించుకుంది. అయితే.. గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు పెండింగ్ నిధులను విడుదల చేయాలని జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కార్యదర్శికి విన్నవించినప్పటికీ.. కేంద్రం అప్పుడు నిధులు విడుదల చేయలేదు.

తాజాగా.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. మరోసారి ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతానికి 708.65 కోట్లను విడుదల చేస్తూ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా పెండింగ్‌లో ఉన్న నిధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news