భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షార్పణం.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..!

-

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వరల్డ్ కప్‌లో ఏకంగా 4 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉత్సాహంగా టోర్నమెంట్‌ను చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరవుతున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ఏమోగానీ ఇప్పటికే 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక ఇవాళ నాటింగామ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మరో మ్యాచ్ కూడా రద్దయింది. దీంతో ఈ టోర్నీలో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌ల సంఖ్య 4కు చేరుకుంది. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్ రద్దుతో ఇండియా, న్యూజిలాండ్‌లు చెరొక పాయింట్‌ను పొందాయి. అయితే మరోవైపు క్రికెట్ అభిమానులు మాత్రం ఐసీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వరల్డ్ కప్‌లో ఏకంగా 4 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉత్సాహంగా టోర్నమెంట్‌ను చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరవుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్ అభిమానులు ట్విట్టర్‌లో ఐసీసీని తీవ్ర పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఐసీసీకి ధోనీ వేసుకున్న గ్లోవ్స్‌పై ఉన్న దృష్టి క్రికెట్ మ్యాచ్‌లు జరిగే ప్రాంతాల్లో ఉన్న వాతావరణంపై లేదని, అందుకనే వర్షం పడే ప్రాంతాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను పెట్టారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఇక కొందరైతే స్విమ్మింగ్ చేస్తూ క్రికెట్ ఆడాలని, వర్షం ఈ టోర్నమెంట్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉందని, ఇకపై క్రికెట్‌ను అండర్ వాటర్‌లో ఆడితే బాగుంటుందని సూచించేలా పలు ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ పెడుతున్నారు. ఈ క్రమంలో ఆ ఫొటోలను చూస్తే అభిమానుల్లో ఎంత అసహనం, ఆగ్రహం ఉన్నాయో మనకు ఇట్టే తెలిసిపోతుంది. మరి మరో 2, 3 రోజులు కూడా ఇంగ్లండ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఇలా వర్షం కారణంగా రద్దవుతాయో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news