ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో స్కీమ్స్ ని అందిస్తున్నారు. వీటి వలన మనకి చక్కటి లాభాలు కలుగుతున్నాయి. బాలికల, మహిళల సంక్షేమంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పధకాలు తీసుకొచ్చారు. నిజంగా కొన్ని స్కీమ్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్ధిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. బాలికల, మహిళల కోసం కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ గురించి.. ఆ స్కీమ్ వివరాల గురించి చూద్దాం.
సుకన్య సమృద్ధి యోజన :
ఈ స్కీమ్ ని ప్రధాని మోదీ 2015లో తీసుకు రావడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన వలన ఆడపిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలానే చదువులు, వివాహ ఖర్చుల కోసం కూడా చూసుకోక్కర్లేదు. ఈ స్కీమ్ లో పదేళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లే చేరాలి. కేవలం రూ. 250తో ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 15 ఏళ్ల పాటు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 25 లక్షలు వస్తాయి. ప్రస్తుత వడ్డీ రేటు 7.60 శాతం వుంది.
బేటీ బచావో-బేటీ పడావో :
ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడం కోసం దీన్ని తీసుకు రావడం జరిగింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. 2015 జనవరి 22న బేటీ బచావో-బేటీ పడావోని తీసుకొచ్చారు.
పీఎం ఉజ్వల యోజన :
2016 మే లో ప్రధాని మోదీ దీన్ని తీసుకొచ్చారు. మహిళలను వంట గ్యాస్ వైపు తీసుకు వెళ్లేందుకు ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వాలనే ఈ స్కీమ్ ఉద్దేశ్యం.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన:
ఈ స్కీమ్ కింద గర్భిణి మహిళలకు రూ. 5 వేలు అందజేస్తారు. మూడు విడతల్లో ఇవి అందుతాయి. తొలి విడత కింద రూ.1000 వస్తాయి.రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. చివరి విడతలో రూ.2 వేలు వస్తాయి. అలానే ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కూడా మోడీ తీసుకొచ్చిన స్కీమ్. దీని ద్వారా ఉచితంగా మందులు, భోజనం, రవాణా సౌకర్యాలు పొందొచ్చు.