రూ.40 లక్షలు కావాలా..? అయితే మీ భార్య పేరు మీద ఈ ఖాతా ని తెరవండి…!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల ప్రయోజనాలని మనం పొందొచ్చు. ఇందులో పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పథకాల్లో డబ్బులు పెడుతూ ఉంటే చాలా చక్కటి ప్రయోజనాలు పొందొచ్చు. రిస్క్ లేకుండా రాబడి వస్తుంది. భారత ప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.

ఈ స్కీమ్స్ లో చేరాలంటే మీరు మీకు పోస్టాఫీస్‌కు వెళ్లి చేరొచ్చు. లేదంటే బ్యాంకులుకి అయినా వెళ్ళచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మంచి స్కీమ్స్ లో పీపీఎఫ్ కూడా ఒకటి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఈ స్కీమ్ లో రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది.

ఏటా రూ. 500 ఇన్వెస్ట్ చేసినా చాలు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 ఏళ్లు. అంటే మీరు 15 ఏళ్ల వరకు డబ్బులు పెట్టాల్సి ఉండి. తర్వాత కూడా మీరు మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకు వెళ్ళచ్చు. ఐదేళ్ల చొప్పున స్కీమ్ మెచ్యూరిటీ కాలం పొడిగించుకోవచ్చు. 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇది మారచ్చు కూడా. భాగస్వామి పేరు పై కూడా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చెయ్యచ్చు.

భాగస్వామి పేరుపై మీరు ఏటా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 40 లక్షలు లభిస్తాయి. మీ పేరుపై కూడా డబ్బులు పెడుతూ ఉంటే మెచ్యూరిటీలో మీకు కూడా రూ. 40 లక్షలు వస్తాయి. ఇలా ఈ స్కీమ్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. రిస్క్ ఏం ఉండదు.

 

Read more RELATED
Recommended to you

Latest news