గన్నవరం రగడ: టీడీపీని నిద్రలేపిన వంశీ..!

-

కృష్ణా జిల్లాలోని గన్నవరం రాజకీయం మరో మలుపు తిరిగింది. ఊహించని విధంగా వైసీపీ శ్రేణులు టి‌డి‌పి ఆఫీసుపై, టి‌డి‌పి నేత ఇంటిపై దాడి చేయడం, టి‌డి‌పి శ్రేణులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడం..అక్కడకు వైసీపీ శ్రేణులు రావడం, దీంతో ఇరువర్గాల మధ్య మళ్ళీ గొడవ జరగడంతో గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యాయి. గన్నవరం టి‌డి‌పికి చెందిన ఓ స్థానిక నేత..వల్లభనేని వంశీపై విమర్శలు చేశారు.

దీనికి బదులుగా వంశీ అనుచరులు..ఆ టి‌డి‌పి నేత ఇంటిపై దాడి చేశారు. దీనిపై కేసు పెట్టడానికి టి‌డి‌పి నేత పట్టభి, పార్టీ శ్రేణులు పోలీసు స్టేషన్‌కు వెళ్ళాయి. దీంతో వంశీ అనుచరులు..టి‌డి‌పి ఆఫీసుపై దాడి చేశారు. పోలీసులు ఉన్నా సరే వంశీ అనుచరులని అదుపు చేయలేని పరిస్తితి. ఈ ఎఫెక్ట్ తో పట్టాభి టి‌డి‌పి శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడకు వైసీపీ శ్రేణులు వచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు.

gannavaram tdp

అయితే ఇంత జరిగిన ఒక్క వైసీపీ నాయకుడు అరెస్ట్ అవ్వలేదని, పోలీసులు వంశీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అసలు విమర్శలు చేస్తేనే ఇలా గొడవలకు దిగితే..తమ అధినేత చంద్రబాబు, లోకేష్‌లని వంశీ, కొడాలి నాని బూతులు తిట్టారని, దానికి టామూ ఏమి చేయాలని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

కానీ ఇంతకాలం గన్నవరంలో టి‌డి‌పి ఉందా? లేదా?అన్నట్లు ఉండేది. అయితే ఈ దెబ్బతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా మేలుకొన్నాయి. వంశీ టి‌డి‌పి లో గెలిచి వైసీపీ వైపుకు వెళ్ళాక అక్కడ టి‌డి‌పి పెద్దగా యాక్టివ్ గా లేదు. అటు ఇంచార్జ్ బచ్చుల అర్జునుడుకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో గన్నవరంలో టి‌డి‌పి దూకుడుగా లేదు. కానీ ఈ గొడవతో టి‌డి‌పి ఒక్కసారిగా యాక్టివ్ గా అయింది. మరి ఇక నుంచి గన్నవరం రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news