18 ఏళ్ళు పైబడిన వాళ్లకు వాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే: కేంద్రం

-

18 నుంచి 45 ఏళ్ళు మధ్య ఉన్న వాళ్ళు వాక్సిన్ కావాలి అంటే కచ్చితంగా కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని ప్రారంభంలో వాక్-ఇన్‌లు అనుమతించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 45 ఏళ్లు పైబడిన వారు టీకాలు తీసుకోవడానికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ ని 18 ఏళ్ళు పైబడిన వారికి మే 1 నుంచి అందిస్తున్న సంగతి తెలిసిందే.

18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుండి కోవిన్ ప్లాట్‌ఫాం అలాగే ఆరోగ్య సేతు యాప్‌ లో ప్రారంభిస్తారు. గందరగోళ పరిస్థితి లేకుండా అందరూ కూడా వాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కరోనా వాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్రాలకు ఉచితంగా వాక్సిన్ అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news