పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన దేశవాసులకు తన ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాడు, పొరుగున ఉన్న భారత్ లో కరోనా రెండో వేవ్ తీవ్రంగా ఉందని అక్కడ ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవటానికి సహాయం చేయాలని అతను విజ్ఞప్తి చేసాడు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో ఇబ్బంది పడుతున్న భారత్ టీకా డ్రైవ్ మూడవ దశను ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది.
వైద్య ఆక్సిజన్ కోసం ఆసుపత్రులు కష్టపడుతున్న తరుణంలో యాక్టివ్ కేసులు 25 లక్షలు దాటాయి. గత 24 గంటల్లోనే మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో యుట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసిన అక్తర… భారత్ కోసం నిధులు సేకరించాలని ఆక్సీజన్ ట్యాంక్ లను పంపించాలని కోరాడు. భారతదేశానికి చాలా ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని తెలిపాడు. ప్రతి ఒక్కరూ భారతదేశానికి విరాళం ఇవ్వండి విజ్ఞప్తి చేసాడు.