కేంద్రం నుండి సూపర్ ఆఫర్… ఉచితంగా రూ.6 వేలు…!

-

అప్పుడప్పుడు కేంద్రం అదిరే ఆఫర్స్ ని అందిస్తోంది. ఇవి ప్రయోజనకరంగా వుంటుంటాయి. ప్రభుత్వం స్కీములని మాత్రమే కాదు ఆఫర్స్ ని కూడా అందుబాటులో ఉంచింది. ఉచితంగా రూ. 6 వేలు పొందే అవకాశం వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం. కేంద్ర ప్రభుత్వం ఒక కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. విజేతగా నిలిస్తే క్యాష్ ప్రైజ్ ని పొందవచ్చు.

రూ.1000 నుంచి రూ. 6 వేల వరకు పొందొచ్చు. ఇక ఈ కాంటెస్ట్ కి సంబంధించి పూర్తి వివరాలని చూద్దాం. మోదీ సర్కార్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసులను మెరుగుపరచాలని చూస్తోంది. మహిళల భద్రత లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకు వచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. దీని కోసం కేంద్ర హోమ్ శాఖ ఓ పాన్ ఇండియా సింగిల్ నెంబర్‌ను తీసుకు వచ్చింది.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 112కు కాల్ చెయ్యవచ్చు. పోలీసులకు, ఫైర్, అంబులెన్స్ ఇలా పలు రకాల ఎమర్జెన్సీ సర్వీసులు ని ఈ నెంబర్ తో పొందొచ్చు. తాజాగా మైగౌవ్‌తో కలిసి ఒక కాంటెస్ట్ ని హోం శాఖ నిర్వహిస్తోంది. రీల్స్ లేదా షార్ట్ వీడియో, లోగో డిజైన్, జంగీల్ కంపోజ్ వంటి వాటికి కోసం
అప్లికేషన్స్‌ను ఆహ్వానిస్తోంది. దీనిలో విజేతగా నిలిస్తే రూ. 6 వేల వరకు డబ్బులు సొంతం చేసుకోవచ్చు. లోగో డిజైన్, జంగిల్ కంపోజ్, రీల్ ఇలా కేటగిరి ప్రకారం క్యాష్ ప్రైజ్ మారిపోతుంది.

రీల్ చేసి విజేతగా నిలిస్తే రూ. 3 వేలు ఇస్తారు. ఫస్ట్ విన్నర్‌కు ఈ డబ్బులొస్తాయి. రెండో విన్నర్‌కు రూ. 2 వేలు, మూడో విన్నర్‌కు రూ. 1000 వస్తాయి. అప్లికేషన్ కి లాస్ట్ డేట్ ఏప్రిల్ 8గా ఉంది. రీల్ 45 సెకన్ల కన్నా ఎక్కువగా వుండకూడదట. సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ రాకూడదు. లోగో డిజైన్ చేయాలని భావిస్తే విజేతలకు రూ. 3 వేలు లభిస్తాయి. టాప్ 5 స్థానాల్లో వాళ్లకి నిలుస్తాయి. పోస్టర్‌ ని పీడీఎఫ్ లేదా జేపీఈజీలో డిజైన్ పంపించాలి. ఫైల్ సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. జంగీల్ కంపోజ్ చేయాలని భావిస్తే ఫస్ట్ విన్నర్‌కు రూ. 6 వేలు. విన్నర్2కు రూ. 4 వేలు వస్తాయి. మూడో విజేతకు రూ. 3 వేలు.

Read more RELATED
Recommended to you

Latest news