కేంద్రం గుడ్ న్యూస్..ఇలా చేస్తే మీ అకౌంట్‌లోకి ఉచితంగా రూ.6 వేలు..

-

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులో ఉంచింది..ఎటువంటి రిస్క్ లేకుండా రూ.6 వేలు పొందవచ్చు..అది ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..కేంద్ర ప్రభుత్వం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే క్యాష్ ప్రైజ్ పొందొచ్చు..అవునండి మీరు విన్నది అక్షరాల నిజం.. రూ. 1000 నుంచి రూ. 6 వేల వరకు సొంతం చేసుకోవచ్చు. ఈ కాంటెస్ట్ ఎలా ఉంటుందో, చివరి తేదీ ఎప్పుడు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం…

మోదీ సర్కార్ అత్యవసర సేవాలను మెరుగు పరిచేందుకు మరీముఖ్యంగా మహిళల భద్రత లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్‌ను అమలులోకి తెచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. దీని కోసం కేంద్ర హోమ్ శాఖ ఒక ప్రత్యేకమైన పాన్ ఇండియా సింగిల్ నెంబర్‌ను లాంచ్ చేసింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 112కు కాల్ చేయొచ్చు. పోలీసులకు, ఫైర్, అంబులెన్స్ ఇలా పలు రకాల ఎమర్జెన్సీ సర్వీసులు పొందొచ్చు.. ఇందులో భాగంగా కాంటెస్ట్‌లో పాల్టొని విజేతగా నిలిస్తే.. ఉచితంగానే రూ. 6 వేల వరకు డబ్బులు సొంతం చేసుకోవచ్చు. లోగో డిజైన్, జంగిల్ కంపోజ్, రీల్ ఇలా మీరు ఎంచుకునే కేటగిరి ప్రకారం మీకు వచ్చే క్యాష్ ప్రైజ్ కూడా మారుతుంది..

మీరు రీల్ చేసి విజేతగా భావిస్తే రూ. 3 వేలు అందిస్తారు. ఫస్ట్ విన్నర్‌కు ఈ మొత్తం వస్తుంది. అదే రెండో విన్నర్‌కు రూ. 2 వేలు, మూడో విన్నర్‌కు రూ. 1000 వస్తాయి. అప్లికేషన్ సమర్పరణకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 8గా ఉంది. రీల్ 45 సెకన్ల కన్నా ఎక్కువగా ఉండకూడదు. అలాగే సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు..అదే విధంగా లోగో డిజైన్ చేయాలని అనుకుంటే రూ. 3 వేలు లభిస్తాయి. ఇలా టాప్ 5 స్థానాల్లో నిలిచిన వారికి డబ్బులు వస్తాయి. పోస్టర్‌ను పీడీఎఫ్ లేదా జేపీఈజీలో డిజైన్ పంపాలి. అయితే ఫైల్ సైజ్ 2 ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు..

అలాగే జంగీల్ కంపోజ్ చేయాలని భావిస్తే.. ఫస్ట్ విన్నర్‌కు రూ. 6 వేలు లభిస్తాయి. సెకండ్ విన్నర్2కు రూ. 4 వేలు వస్తాయి. ఇక మూడో విజేతకు రూ. 3 వేల వస్తాయి. స్క్రిప్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించాలి. జింగిల్ 45 సెకన్ల పాటు ఉండాలి. గూగుల్ డ్రైవ్‌లో హై క్వాలిటీతో జింగిల్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.. చూసారుగా మీకు ఈ టాలెంట్ ఉంటే మీరు కూడా ఇలా చేసి డబ్బులను పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news