ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్రం క్లారిటీ..

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నెలకొన్న అస్పష్టత తెలియనిది కాదు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరుత్సాహానికి గురిచేసాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ పట్నం అని అర్థం వచ్చేలా జులై 26వ తేదీన లోక్ సభలో ఒక ప్రకటన చేసింది. దాంతో వివాదం చెలరేగింది. ఐతే ప్రస్తుతం ఈ వివాదంపై కేంద్రం నోరు విప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదని, నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ పట్నం ఒక నగరం మాత్రమే అని, పెట్రో పన్నుల విషయంలో విశాఖను ఉదహరణగా తీసుకున్నామని, అంబాలా, లూథియానా నగరాలను కూడా ఉదాహరణగా తీసుకున్నామని, అవి కూడా రాజధానులు కావని కేంద్రం పేర్కొంది. టైటిల్ విషయంలో పొరపాటు జరిగిందని, అందువల్ల దాన్ని సరిదిద్దుతున్నామని కేంద్రం తెలిపింది. మరి దీంతో వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news