కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఇక జీఎస్టీ నష్టాలను ఇప్పుడు పూడ్చలేని చేతులు ఎత్తేసింది కేంద్రం. కావాలంటే రాష్ట్రాలకు అప్పు ఇప్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు మార్గాలు సూచించారు ఆమె. అందులో ఒకటి ఆర్బీఐ ద్వారా హేతుబద్దమైన వడ్డీకి అప్పు ఇప్పించే ఏర్పాటు ఒకటి కాగా, ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ మరో మార్గమని సూచించించారు. మీకేది కావాలో వారం రోజులలో చెప్పమని పేర్కోన్నారు నిర్మలా సీతా రామన్. ఇక కరోనా విజృంభణను దైవఘటనగా అభివర్ణించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.