మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చింత మోహన్ దేశ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో రాజకీయాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి, కేంద్రంలోని మోదీ అడుగు జాడల్లో సంచలనమైన నిర్ణయం తీసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు చింతామోహన్ చెబుతున్నారు. రానున్న రెండు నెలల కాలంలో మోదీ లోక్ సభ ను రద్దు చేయడానికి చూస్తున్నారని చింతామోహన్ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు రెండు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ వస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే ఎక్కడ తేడా కొడుతుందేమోనన్న ఆందోళనతోనే బీజేపీ లోక్ సభను రద్దు చేసి త్వరగా ఎన్నికలు వచ్చేలా చేసి అడ్వాంటేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.
మరి చింతామోహన్ చెప్పినట్లుగా లోక్ సభ నిజంగా రద్దు అయ్యి డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయా లేదా అన్నది తెలియాలంటే రెండు నెలల వరకు ఆగాల్సిందే.