దేశంలో పెరుగుతోన్న ఇన్‌ఫెక్షన్లు.. 6 రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్‌

-

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మరోవైపు వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ  ఇన్‌ఫెక్షన్ల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. తాజాగా కరోనా కేసులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ  లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య పెంచడంతోపాటు వ్యాక్సినేషన్‌పైనా దృష్టి పెట్టాలని పేర్కొంది.

కరోనా, ఇన్‌ఫెక్షన్ల ప్రభావిత ప్రాంతాల్లో వైరస్‌ కట్డడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇన్‌ఫ్లుయెంజాతోపాటు కొవిడ్‌ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news