సోషల్ మీడియాలో అతి చేస్తే తాట తీయండి… కేంద్ర హోం శాఖ వార్నింగ్…?

-

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీ లు కూడా ఈ బిల్లుపై కదం తొక్కాయి. కాంగ్రెస్, ఆర్జెడి, తృణముల్ కాంగ్రెస్ సహా అనేక పార్టీలు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. బెంగాల్ లో మమతా బెనర్జీ 7 కిలోమీటర్ల ర్యాలీ కూడా చేసారు. అది పక్కన పెడితే… ఈ నిరసనల ముసుగులో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కొన్ని ప్రచారాలు అల్లర్లకు ఆజ్యం పోస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్రం ఇంటర్నెట్ సేవలను ఆపేసింది. అయితే ఇప్పుడు కేంద్ర హోం శాఖ సోషల్ మీడియా విషయంలో సీరియస్ గా ఉంది. అన్ని రాష్ట్రాల హోం మంత్రులకు ఇప్పటికే అమిత్ షా కార్యాలయం కీలక సూచనలు చేసింది. బిల్లు విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని, వారిని వెంటనే అదుపులోకి తీసుకుని నాన్ బెయిల్ కేసులు నమోదు చెయ్యాలని హెచ్చరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు కూడా అల్లర్ల కోసం చేస్తున్నారని,

ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారనే అనుమానం వ్యక్తం చేసింది. ఇక మద్దతుగా వ్యాఖ్యలు చేసే వాళ్ళను కూడా కనిపెట్టాలని… డబుల్ మీనింగ్ తో ఉన్న పోస్ట్ లను కూడా గుర్తించాలని కేంద్రం సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాయి. బెంగాల్ ని హోం శాఖ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేసి కేసులు నమోదు చెయ్యాలని సూచించిందని అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాట్లడకు౦డా ఉంటె మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news