జగన్ కీలక ప్రకటన… ఏపీకి మూడు రాజధానులు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరం ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. లెజిస్లేటివ్, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ కి కూడా కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సౌత్ ఆఫ్రికా మోడల్ అమలు చేస్తామన్నారు. అమరావతిలో లెజిస్లేచర్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌, కర్నూలులో… జ్యుడిషియల్ రాజధాని ఉండే అవకాశం ఉందని అన్నారు. అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటి నివేదిక వారంలో వస్తుందని… అప్పుడు దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని జగన్ వ్యాఖ్యానించారు.

అదే విధంగా రాజధాని కోసం తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ ఖర్చు చేసిందని జగన్ అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ… పోలవర౦ నుంచి సీమకు నీళ్ళు తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అమరావతిలో 4070 ఎకరాలు చంద్రబాబు బినామీలు కొనుగోలు చేసారని జగన్ ఆరోపించారు. రాజధాని కోసం చెప్పిన దానికన్నా తక్కువ ఖర్చు చేసారని జగన్ విమర్శించారు.

ఈ సంచలన నిర్ణయంతో, విశాఖలో సెక్రెటెరియేట్‌, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పడే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news