పెట్రోల్, డిజిల్ సుంకాలతో కేంద్రానికి కాసుల పంట…

-

దేశంలో పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీపావళికి ముందు కేంద్రం పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ.10 తగ్గించించాయి. దీంతో పలు రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడిచాయి. పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గిస్తూ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇప్పటికీ వీటిపై అధికంగానే సుంకాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాలు ధరలు తగ్గించినా.. ఇప్పటికీ పెట్రోల్, డిజిల్ రేట్లు వందకు పైగానే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే పెట్రోల్, డిజిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగానే ఆదాయం పొందుతున్నాయి. చమురుపై సుంకాలతో కేంద్రం ఎక్కువగా ఆదాయం పొందుతోంది. పెట్రల్, డిజిల్ పై విపరీతంగా సుంకాలు పెంచడంతో గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి భారీగా డబ్బులు వచ్చాయి.  2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సుంకాలు, పన్నులు, సెస్ ల రూపంలో రూ 4.55లక్షల కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి చెప్పారు. ఇదిలా ఉంటే… వ్యాట్ రూపంలో రాష్ట్రాలకు రూ. 2.02 లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news