యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే డెలివరీ చేసిన భర్త !

తమిళనాడు రాష్ట్రంలో.. త్రీ ఇడియట్స్ సినిమాలో జరిగిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఆ సినిమాలో.. యువతికి.. ఫోన్ లో డాక్టర్ చెబుతుంటే ప్రసవం చేస్తాడు హీరో. అదే తరహాలో ను తమిళనాడులో ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియో చూసి తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేసాడు. ఈ సంఘటన రెండు రోజుల కింద జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని.. పానపక్కం ప్రాంతంలో.. ఓ కిరానా షాప్ నడుపుతున్నాను వ్యక్తికి ఏడాది క్రితం వివాహం అయింది. కొన్నాళ్ళకే అతని భార్య గర్భం దాల్చింది.

నెలలు నిండిన కళ్ళతో డిసెంబర్ 18వ తేదీన ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే.. ఆసుపత్రికి తీసుకు వెళ్లే బదులు ఇంట్లోనే బిడ్డను ప్రసవించే ఎలా చేయాలి అనుకున్నాడు ఆ భర్త. ఈ నేపథ్యంలోనే ఈ యూట్యూబ్ వీడియోలు చూడడం తోపాటు సోదరిని సలహాలు అడిగి తెలుసుకున్నాడు. అయితే ఇలా చేస్తున్న క్రమంలో చాలా సేపటికి ఆమె ప్రసవించింది. అయితే విషాదకరమైన విషయం ఏమిటంటే… పుట్టిన బిడ్డ అప్పుడే చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని భార్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.