వారికి ఇక మాస్క్ అక్కర్లేదు.. కేంద్రం కీలక ప్రకటన !

చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి మన దేశంలోనూ… విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో మూడో రూపంలో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మాస్క్ ను తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్కు ధరించకపోతే వేలకు వేలు ఫైన్ విధిస్తున్నాయి ప్రభుత్వాలు.

బైక్ పైన వెళ్ళిన లేదా కారులో వెళ్ళిన మాస్కు తప్పని సరి అని.. ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఒంటరిగా బైక్ లేదా సైకిల్ పై వెళ్లేవారు మాస్కులు ధరించడం వారి ఇష్టమని… అలాంటి వారికి చలాన్లు విధించ కూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా విజృంభణ తగ్గిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో.. కొంత మందికి ఊరట లభించే అవకాశం ఉంది.