ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేసే కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ ప్రక్రియను ముగించడానికి నిర్నిత గడువును కూడా నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయని వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తీయమని స్పష్టం చేశారు.
ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ద్వారా నకిలీ ఓట్లను గుర్తించవచ్చని ఈసీ భావిస్తోంది.ఇది ఇలా వుండగా, వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగులకు ఇంటివద్దే ఆధార్ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. సంక్షేమ పథకాలు, ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీరంతా ఈ-మెయిల్ ద్వారా సమాచారం UIDAI కి పంపితే…ఏడు రోజుల్లోగా ఇంటికెళ్లి వివరాలు నమోదు చేస్తారు. ఒక అడ్రస్ లో ఉన్న తొలి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి రూ.350 వసూలు చేస్తారు.