క్రేజీ అప్డేట్: లారెన్స్ “చంద్రముఖి 2” రిలీజ్ డేట్ ఫిక్స్…

-

గతంలో తమిళ దర్శకుడు పి వాసు మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్ర చంద్రముఖి తెలుగు మరియు తమిళ భాషలలో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూశాము. అప్పటి నుండి ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తీయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నా ఎందుకో వివిధ కారణాల వలన అది కుదరలేదు. కానీ ఇంతకాలానికి ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతోంది, కానీ అందరూ అనుకుంటున్నట్లుగా ఇందులో రజినీకాంత్ నటించడం లేదు. తనకు బదులుగా ప్రముఖ దర్శక నటుడు రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 లోప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది, కాగా మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం విశేషం.

అంతా అనుకున్నట్లై జరిగితే ఈ వినాయకచవితికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news