చాలా రోజులుగా తెలంగాణ BRS ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డైరీ ఎండీ శేజల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈమె నిర్విరామంగా తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెల్లడినాయికి ప్రయత్నిస్తున్నా , ఒక పరిష్కారం అయితే ఇప్పటి వరకు కలుగలేదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది… స్వయంగా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా ఆమెను మా స్టాఫ్ కలిశారని లైంగిక వేధింపులు లాంటి పెద్ద విషయం కాదని క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా శేజల్ మాలీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతకు ముందు ఒకసారి ఢిల్లీ లోనూ ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్ దగ్గర స్పృహ తప్పి పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. ఆమె దగ్గర ఉన్న హ్యాండ్ బాగ్ లో పరిశీలిస్తే అందులో నిద్ర మాత్రలు దొరికాయట. ఇక ఈ విషయాన్ని సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈమె చనిపోవడానికి నిద్రమాత్రలు తీసుకోవడం వలన స్పృహ తప్పి పడిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పుడైనా ప్రభుత్వం దుర్గం చిన్నయ్యను అదుపులోకి తీసుకుని అసలు ఏమి జరిగిందో ఈ ప్రపంచానికి తెలియచేస్తుందా చూడాలి.