టీడీపీ నేతల కొంప ముంచిన ‘ఛలో పులివెందుల’…21 మంది అరెస్ట్ !

Join Our Community
follow manalokam on social media

కొద్ది రోజుల క్రితం ఛలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల ప్రాంతంలో ఓ దళిత మహిళ అత్యాచారం ఆపై హత్యకు గురికావడం పై టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో పులివెందుల కార్యక్రమం నిర్వహించారు. అయితే ఛలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొన్న 21 మంది టీడీపీ నేతల పై పులివెందుల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే నేడు బీటెక్ రవిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో నాగమ్మ అనే ఓ దళిత మహిళ డిసెంబరు 7న అదే గ్రామ సమీపంలోని గుట్టల్లో హత్యకు గురైంది.

ఈ హత్యలో సంబంధం ఉందంటూ ఇద్దరు మైనర్లతో పాటు ఓ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే వైసీపీకి చెందిన కొందరు సదరు మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని.. దాని పై నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు డిసెంబరు 19న చలో పులివెందుల కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ శ్రేణులు చేపట్టిన చర్యల వల్ల తమ కుటుంబానికి పరువు నష్టం జరిగిందంటూ హత్యకు గురైన నాగమ్మ తల్లి పుల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుల్లమ్మ పిర్యాదు మేరకు ఛలో పులివెందుల కార్యక్రమంలో పాల్గొన్న 21 మందిపై పులివెందుల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

TOP STORIES

సంస్కృతం నేర్చుకోవాల‌నుకునే వారి కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్‌..!

సంస్కృతం భాష‌ను దైవ భాష అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భార‌తీయ భాష‌లు వ‌చ్చాయ‌ని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత...