2020 సంవత్సరంలో అనేక మొబైల్ తయారీ కంపెనీలు ఎన్నో అద్భుతమైన ఫోన్లను విడుదల చేశాయి. వాటిల్లో ఎన్నో రకాల ఫీచర్లను అందించారు. అనేక మోడల్స్ ను వినియోగదారులు భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. అయితే 2021 వచ్చింది. ఈ ఏడాదిలోనూ కంపెనీలు ఇంకా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాదిలో ఆయా కంపెనీల నుంచి పలు ఫ్లాగ్ షిప్ ఫోన్లు రానున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో పిక్సల్ 5ఎ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అలాగే యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ ఫోన్‌కు గాను 2021 వేరియెంట్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఇక రియల్‌మి సంస్థ రియల్‌మి కోయ్, ఏస్ పేరిట రెండు అద్భుతమైన ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. వీటిల్లో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందిస్తారని తెలిసింది. ఈ ప్రాసెసర్ క్వాల్‌కామ్ నుంచి విడుదలైన లేటెస్ట్ ప్రాసెసర్ కావడం విశేషం.
అలాగే షియోమీ కంపెనీ రెడ్‌మీ కె 40 ప్రొ, పోకో ఎఫ్3 ప్రొ ఫోన్లను విడుదల చేయనుంది. ఇక జనవరి 5న ఎంఐ 10ఐ ఫోన్ విడుదల కానుంది. అలాగే రియల్‌మికి చెందిన ఎక్స్7 ప్రొ ఫోన్, వన్‌ప్లస్ 9 లైట్, పోకో ఎఫ్2, రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్, వన్‌ప్లస్ నార్డ్ 2, రియల్‌మి 8 ప్రొ, రెడ్‌మీ కె40, రియల్‌మి ఎక్స్4, ఎక్స్4 సూపర్ జూమ్ తదితర ఫోన్లు కూడా అతి త్వరలోను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫోన్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మరో 2, 3 నెలల్లో స్మార్ట్ ఫోన్ యూజర్లు పండగ చేసుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లు మార్కెట్‌లోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి వీటిలో వినియోగదారులను ఏ ఫోన్లు ఆకట్టుకుంటాయో చూడాలి.