ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ సక్సెస్ అయింది. పోలీసులు ఎన్ని నిర్భందాలు విధించినా… ఉద్యోగుల పెద్ద ఎత్తున విజయవాడకు తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వరకు విజయవాడకు వచ్చినట్లు సమాచారం. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు కనుచూపు మేరలో ఉద్యోగులతో కనిపించింది. పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారువేశంలో విజయవాడ చేరుకుని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.
ఇదిలా ఉంటే ఛలో విజయవాడ సక్సెస్ అయిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి నుంచి పెన్ డౌన్ చేస్తున్నామంటూ.. సర్కార్ కు అల్టిమెటం జారీ చేశారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ తమకు సమ్మతంగా లేదని ఉద్యోగులు పలు రోజులగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈనెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నట్లు నోటీసులు కూడా ఇచ్చారు.
ఉద్యోగులు తమ డిమాండ్లపై ఇప్పటికే మంత్రుల కమిటీని కలిసింది. అయితే ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించకపోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉద్యోగుల సమ్మెపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.