కొత్త సినిమా సంద‌డిలో మ‌హేశ్ ..పూజ..మ‌ళ్లీ త్రివిక్ర‌మ్

-

అత‌డు
ఖ‌లేజా
మానియాలో మ‌రో సినిమా మ‌హేశ్ నుంచి..
ఇల్లే కాదు ఊహించుకుంటే ఇంట్లో అంతా బాగుంటారు
ఆ విధంగా మ‌హేశ్ కూడా బాగుంటారు
అని అభిమానులు ఆకాంక్షిస్తూ..
ఆయ‌న‌కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు..
ఆయ‌న‌తో పాటు పూజాబేబీకి కూడా ఆల్ ద బెస్ట్….
త్రివిక్ర‌మ్ స‌ర్ మీక్కూడా!

హారికా హాసినీ క్రియేష‌న్స్ కొత్త సినిమా సంద‌డికి రంగం సిద్ధం చేసింది.ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న మ‌హేశ్ బాబు – త్రివిక్ర‌మ్ శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపొందే సినిమాను ఇవాళ ముహూర్తం షాట్ తో ఆరంభించింది. మ‌హేశ్ తో త్రివిక్ర‌మ్ చేస్తున్న మూడో సినిమా ఇది.గ‌తంలో అత‌డు తో పెద్ద హిట్ కొట్టాడు త్రివిక్ర‌మ్..అస‌లీ సినిమానే ఓ పెద్ద వండ‌ర్..సెన్సేష‌న్ కూడా! త‌రువాత ఖ‌లేజా తో కాస్త నిరాశ అయినా బుల్లి తెర‌పై సంచ‌నాలు న‌మోదు చేసింది.

ఈ రెండు సినిమాలూ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లు కాక‌పోయినా రైట‌ర్ గా త్రివిక్ర‌మ్ బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు.ఇప్పుడు మ‌హేశ్ మానియాను కొన‌సాగించేందుకు త్రివిక్ర‌మ్ సిద్ధం అవుతున్నారు. స‌ర్కారు వారి పాట సినిమా ముగించి, క్వారైంట‌న్ టైం ను కూడా ముగించుకుని త్వ‌ర‌లో ఈ సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మ‌హేశ్. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఈ చిత్రానికి నిల‌వ‌నుంది. ఇవాళ పూజా కార్య‌క్ర‌మానికి నిర్మాత రాధాకృష్ణ,మ‌హేశ్ జీవ‌న స‌హ‌చ‌రి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఇంకా ఇంకొంద‌రు యూనిట్ స‌భ్యులు,త్రివిక్ర‌మ్ శ్రేయోభిలాషులు, మ‌హేశ్ బాబు శ్రేయోభిలాషులు పాల్గొని, చిత్ర యూనిట్ కు అభినంద‌న‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news