లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్న కాజల్.. స్టార్ హీరోయిన్గా చలామణి అయింది. ఇకపోతే కొంతకాలం క్రితం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న కాజల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇకపోతే తాను గర్భవతి అని తెలిసినప్పుడు నటించాల్సిన ఎన్నో ప్రాజెక్ట్లను కూడా వదులుకుంది.ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తన శరీర ఆకృతితో పాటు ముఖ ఆకృతి కూడా పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మునుపటి అందాన్ని పొందడానికి కాజల్ అగర్వాల్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రమంలోనే ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది బాగా పాపులారిటీ అయింది. ఇకపోతే బిడ్డకు జన్మనిచ్చిన తరుణంలో భారీగా బరువు పెరిగిన కాజల్ బరువు తగ్గే పనిలో ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో భాగంగానే మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను కూడా నియమించుకున్న కాజల్.. చమటలు కక్కుతూ కుస్తీ పడుతుంది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేయగా సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ గా మారుతుంది.
ఇకపోతే కాజల్ సినిమా విషయానికి వస్తే ఆచార్య సినిమాలో నటించాల్సి ఉండగా.. అందుకు సంబంధించి కొంచెం చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. కానీ ఈమె గర్భవతి అని తెలియడంతో ఈమె నటించిన సీన్స్ కూడా తొలగించి ఆమెను కూడా సినిమా నుంచి తప్పించడం జరిగింది . కానీ ఈ సినిమా ప్లాప్ అవడంతో కాజల్ కి ఒకరకంగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం మంచి కథ దొరికితే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
View this post on Instagram