పంజాబ్ లో ఇటీవల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ ప్రభుత్వం.. కొత్త డిమాండ్ కు తెరలేపింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని గా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న చండీగఢ్ నగరాన్ని పంజాబ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని కోసం ముఖ్య మంత్రి భగవంత్ మాన్ సింగ్.. ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చారు. అంతే కాకుండా తీర్మానం కూడా చేశారు. పంజాబ్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు.
చండీగఢ్ నగరంపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని స్పష్టం చేశారు. కాగ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. చండీగఢ్ నగరంలోని ఉద్యోగులకు పంజాబ్ స్టేట్ సర్వీస్ రూల్స్ వర్తించవని ప్రకటించారు. చండీగఢ్ లో పూర్తిగా సెంట్రల్ సర్వీస్ రూల్స్ మాత్రమే వర్తిస్తాయని వెల్లడించారు. కాగ దీన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చండీగఢ్ నగరాన్ని పంజాబ్ రాష్ట్రంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ LIVE https://t.co/srqchzWGzN
— Bhagwant Mann (@BhagwantMann) April 1, 2022