ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు: చంద్రబాబు

-

నందమూరి తారకరత్న చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాటం చేసి, ఓడిపోయారని చెప్పారు. ఒకేరోజు 9 సినిమాలు ప్రారంభించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారన్నారు.

ఎప్పుడు రాజకీయాల పట్ల ఆలోచన ఉన్న వ్యక్తి అని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారని గుర్తుచేశారు. కుటుంబమంతా ఆవేదనలో ఉన్నామని, తారకరత్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.

కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వాలని కలలు కన్న తారకరత్న అనుకున్నంత స్థాయిలో హీరోగా ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై ఇటీవల రాజకీయాలలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర జనవరి 27 ఉదయం మొదలవగా అప్పటికే తారకరత్న అస్వస్థకు ఫీలయ్యారని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news